top of page


కాక్రోచ్ విజయానికి కాంగ్రెస్ బాజాలు!
ఎవరో.. ఏదో సాధిస్తే.. దాన్ని మనమే సాధించినట్లు చంకలు గుద్దుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. తన చేష్టలతో ప్రజల్లో మరింత చులకన అవుతున్నది. సుమారు నెలరోజులుగా దేశంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉద్యమం కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, అసలు ప్రజల్లోనే లేని కొందరు వ్యక్తులు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా వేదికగా నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లీకేజీ బాధిత వి

DV RAMANA
Jul 283 min read


యువతరం శిరమెత్తితే..!
దేశ రాజకీయాలు కొత్త పుంతల తొక్కుతున్నాయి. ప్రజల మనోభావాల్లో కూడా యువోత్సాహం తొణికిసలాడుతన్నది. ఈ మార్పులకు సంకేతం ఢిల్లీ పీఠాన్ని వణికించిన జెన్‌జీ ఉద్యమంగా చెప్పవచ్చు. మన దేశ రాజకీయాలను పరిశీలిస్తే తొలి నుంచీ యువతరం పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది. ప్రాతినిధ్యం వహించిన కొద్దిపాటి యువ నేతలు కూడా రాజకీయ కుటుంబాలకు చెందినవారో, ప్రముఖుల వారసులో కావడం మొదటి నుంచీ కొనసాగుతన్నది. కానీ నీట్ లీకేజీ బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ 26 రోజులపాటు ఢిల్లీ జంతర్ కేంద్రంగా సాగిన ఉద్యమం దేశ

DV RAMANA
Jul 273 min read


‘నీట్ ’గా ఇరుక్కున్న కేంద్రం!
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం అనంతరం మళ్లీ నీట్ పరీక్షలు నిర్వహించడం, ర్యాంకర్లకు సీట్లు కేటాయించడం.. అన్నీ జరిగిపోవడంతో ఇక లీకేజీ ఉదంతం తెరమరుగైపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో ఉరుము లేని పిడుగులో సోషల్ మీడియా ప్లాట్‌ఫారంపై పురుడు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ పార్టీని నిర్వాహకులు ప్రకటించినప్పుడు అదేదో ప్రభుత్వాలపై సెటైర్లు వేసి నాలు

DV RAMANA
Jul 252 min read


నెలన్నరగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
ప్రస్తుతం దేశం దృష్టంతా దేశ రాజధాని ఢిల్లీపై ఉంది. చర్చంతా కాక్రోచ్ పార్టీపైన.. అది చేస్తున్న ఉద్యమంపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ ఉద్రిక్తతలు, వివాదాల జడిలో దేశంలో జరుగుతున్న ఇతర పరిణామాలు ఎవరికీ పట్టడం లేదు. ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగితే పదేపదే దాన్ని ప్రొజెక్టు చేస్తూ.. మిగితా అంశాలను గాలికొదిలేసే మన మీడియా తీరు కూడా దీనికి ఒక కారణం. పాకిస్తాన్‌లోన, శ్రీలంకలోనూ పెట్రోల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు తారాజువ్వల్లా ఎగసిపడుతున్నాయని ఆ మధ్య జాతీయ మీడియాలో కోకొల్లలుగా వార్తలు వచ్చా

DV RAMANA
Jul 243 min read


ధర్మేంద్రుడి ముందంతా ముళ్లబాటే!
దేశమంతా ఇప్పుడు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నది. అదే కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ పార్టీ చేపట్టిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్. ఈ డిమాండ్‌తో గత కొన్నిరోజులుగా లడ్డాఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, దానికి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ ఛలో పార్లమెంటు ఉద్యమానికి పిలుపునివ్వడం, దేశంలోని చాలా ప్రాంతాల నుంచి విద్యార్థులు,

DV RAMANA
Jul 232 min read


అపరిచితుడి చేతిలో ఉద్యమ రాయి!
ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి అపరిమితంగా పెరిగినప్పుడు దానికి ఒక బలమైన సిద్ధాంతం తోడైనప్పుడు, దానికి ఒక సమర్థమైన నాయకత్వం లభించినప్పుడు వాటి నుంచి ఒక బలమైన ఉద్యమం పుడుతుంది. కానీ అదేం చిత్రమో గానీ.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఉద్యమం వెనుక యువజనుల్లో పేరుకుపోయిన కొండంత అసంతృప్తి కనిపిస్తున్నా.. దానికి ఒక సైద్ధాంతికత గానీ, ప్రముఖ నాయకత్వం గానీ కనిపించడం లేదు. దీన్ని నడుపుతున్న అభిజిత్ దిబ్కే గానీ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్

DV RAMANA
Jul 223 min read


ఉచితానికి చెల్లు.. ఇక UPI బాదుడు!
పూర్వం జేబులో నిండుగా డబ్బులు ఉంటే తప్ప బజారు చేయడం సాధ్యమయ్యేది కాదు. కాలక్రమేణా డబ్బుతో పనిలేకుండా పోయింది. నగదు స్థానంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ (ఏటీఎం) కార్డులు ఉంటే మార్కెట్లో పెద్దపెద్ద లావాదేవీలను ఇట్టే చక్కబెట్టేసే సౌలభ్యం ఏర్పడింది. ఇక ఆధునిక యుగంలో కరెన్సీతో పాటు కార్డుల అవసరం కూడా లేకుండాపోయింది. యÖనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెల్లింపు వ్యవస్థ అంతా మన సెల్ఫోన్లలోకి వచ్చేసింది. జేబులో సెల్‌ఫోన్ అందులో య

DV RAMANA
Jul 213 min read


‘స్థానిక’ సీట్లపై తలోమాట.. తెస్తుందా తలపోటు
‘రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగేలా మేం కలిసి ఉంటాం. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు’.. అని స్వయంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కొన్నాళ్ల క్రితం ఉవాచించారు. కూటమి ప్రభుత్వం కొనసాగడమన్నది ప్రభుత్వ పనితీరు, ఆపై ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎన్నికల్లో తప్ప ఇప్పుడప్పుడే తేలేది కాదు. ఇకపోతే కూటమి పార్టీలు కలిసి ఉండటమన్నదానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సంగతేమో గానీ.. త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నిక

DV RAMANA
Jul 203 min read


హై.. హై.. రైల్వే శాఖ!
సుమారుగా రెండు శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ రైల్వేల్లో మరో కొత్త శకం ప్రారంభ మైంది. దేశంలోని తొట్టతొలి హైడ్రోజన్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపడంతో పట్టాలపై పరుగులు తీయడం మన రైల్వేలు సాధించిన మరో అద్భుత విజయంగా చెప్పవచ్చు. జీరో కాలుష్యంతో పూర్తిస్థాయి గ్రీన్ రైలు కావడం మరో విశేషం. దాదాపు నీటితోనే నడిచే ఈ రైలు విని యోగం తర్వాత అదే నీటిని బయటకు విడిచిపెట్టడం దీని ప్రత్యేకత. హర్యానాలోని జింద్`సోనేపట్ మధ్య తొలి గ్రీన్ రైలు సర్వీస్ ప్రారంభం కావడంతో ప్రపంచంలో

DV RAMANA
Jul 183 min read


చైనా దుర్నీతికి చెప్పుదెబ్బ!
తనకు పెద్దగా పట్టులేని బంగాళాఖాతంలో ఇతర చిన్న దేశాల సాయంతో పాగా వేసి ఇంతవరకు ఈ సాగరంపై సంప్రదాయకంగా భారత్‌కు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించని విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణచైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికా సహా 14 దేశాలు బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహిం

DV RAMANA
Jul 173 min read


పథకాల్లో కోత.. ప్రభుత్వాలకు వాత!
జనాకర్షక పథకాలు ఎన్నికల్లో ఓట్లు కుమ్మరించవచ్చేమోగానీ.. ఆ తర్వాత వాటిని క్రమం తప్పకుండా అమలు చేయడం ప్రభుత్వాలకు కత్తిమీద సామే అవుతుంది. వాటికి అవసరమైన వందలు, వేల కోట్ల నిధులు సర్దుబాటు చేయలేక లబ్ధిదారుల జాబితాల్లో కోతలు విధించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇది ప్రజల్లో మరింత అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమై ప్రభుత్వాలను కూల్చే స్థాయికి పెరిగినా ఆశ్చర్యపోనవసరంలేదని అనేక గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా పార్టీలు, ప్రభుత్వాలు వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడంలేదు. దాని ఫలితాన్నే ఇప

DV RAMANA
Jul 152 min read


సంప్రదాయ క్రికెట్‌కు ఐపీఎల్ సమాధి!
క్రికెట్లో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందాలంటే టెస్ట్ మ్యాచుల్లో రాణించాల్సిందేనని గతంలో చెప్పేవారు. కానీ కాలచక్రం వేగం పుంజుకున్న క్రమంలో దాంతోపాటే క్రికెట్ మ్యాచ్‌ల స్వరూపం మారిపోయింది. గతంలో ఉన్న ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త ఐదు రోజులకు తగ్గిపోయింది. కాలక్రమంలో అదీ ఆకర్షణ కోల్పోయి దాని స్థానాన్ని వన్డే క్రికెట్ ఆక్రమించింది. కొన్నేళ్లకు దాని క్రేజ్‌ను పొట్టి క్రికెట్ కబళించింది. ఒకరోజంతా క్రీడాకారులు ఆడటం, దాన్ని పనులన్నీ మానుకుని ప్రేక్షకులు చూడటం ఉత్త వేస్ట్ అని భ

DV RAMANA
Jul 143 min read


తొందరపాటు, లేటు.. రెండూ అనర్థదాయకమే!
భారతీయ సమాజం ఆధునిక భావాలను, పోకడలను ఎంత ప్రోత్సహిస్తుందో.. సనాతన సంప్రదాయాలను అంతేస్థాయిలో గౌరవిస్తుంది. రెండింటి సమ్మేళనమే భారతదేశం అని చెప్పవచ్చు. అయితే ప్రపంచంపై జనాభా హెచ్చుతగ్గులు చూపే ప్రభావాలపై విస్తృత చర్చ జరుగుతున్న ఈ సమయంలో భారతీయ సమాజం పరస్పర విరుద్ధమైన రెండు ప్రభావాల మధ్య నలిగిపోతున్నది. వాటిలో మొదటిది బాల్యవివాహ సంప్రదాయం కాగా.. రెండోది ఆధునిక యువత వివాహాలను వాయిదా వేసుకుంటుండటం. ఈ రెండూ కూడా సమాజానికి చెడు చేసేవే కావడం విచారకరం. తెలిసీ తెలియని వయసులోనే పిల్లల

DV RAMANA
Jul 132 min read


ఇలా అయితే భవిష్యత్తే బ్లాకౌట్!
అభివృద్ధి అంటే కొత్త సౌకర్యాలు, సొబగులు, ఆకర్షణలు కల్పించేదిగా ఉండాలే తప్ప ఉన్న సౌకర్యాలను ఊడగొట్టేదిగా.. కొత్త కష్టాలు సృష్టించేదిగా ఉండకూడదు. కానీ ఈ పాటి వివేచన ప్రభుత్వాలకు, దాని ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ఎందుకు ఉండటంలేదో అర్థం కావడంలేదు. వీరి అనాలోచిత నిర్ణయాలు, చర్యలకు నగర జీవనం బలైపోతున్నది. వర్షాకాలం వస్తే చాలు.. ఏ వర్షం, ఎప్పుడు తమను ముంచేస్తుందోనని మెట్రో నగరాలు బెంగటిల్లిపోతున్నాయి. ఈ భయాలకు ఇటీవల భారీవర్షాల తో తల్లడిల్లిన పలు నగరాల దుస్థితే నిదర్శనం. రుతుపవ

DV RAMANA
Jul 113 min read


ఆరోగ్య భారతానికి డిజిటల్ వారధి
సంపూర్ణ ఆరోగ్య భారతాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలన్నింటినీ డిజిటలైజ్ చేసి ఒకే ఆన్లైన్ ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చింది. దీంతో దేశప్రజలు అన్ని రకాల వైద్యసేవలను ఇంటి నుంచే పొందవచ్చని కేsద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ సమయంలో రోగుల కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసేందుకు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసేందుకు రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను ఈ లక్ష్యసాధన కోసం పూర్తిస్థాయి డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారంగా అప్గ్రేడ

DV RAMANA
Jul 103 min read


ప్రపంచ మార్కెట్లపై ట్రంప్ తూటాలు
‘సీజ్ ఫైర్ ముగిసింది’.. అన్న ఒక్కమాట యావత్తు ప్రపంచం గుండెల్లోకి తూటాలా దూసుకుపోయింది. ప్రపంచ ఆర్థిక, రవాణా, వాణిజ్య, చమురు రంగాలను అతలాకుతలం చేసేసింది. మళ్లీ అమెరికా`ఇరాన్ మధ్య దాడులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు షాక్‌కు గురై కుప్పకూలాయి. అంతర్జాతీయ ప్రయాణాలు సంక్షోభంలో పడ్డాయి. దీనంతటికీ కారణం.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాశయుడేనంటూ యావత్తు ప్రపంచం ముక్తకంఠంతో ఘోషిస్తున్నది. పిచ్చివాడి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో.. ట్రంప్ దొరగారి పాలన అలానే ఉందన్న వ్యాఖ్యలు, వ

DV RAMANA
Jul 93 min read


అసమానతల అభివృద్ధి!
మన ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది.. అగ్రదేశాలతో పోటీపడుతూ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అమెరికా, చైనాల వంటి దేశాల సరసన చేరిందని మనం చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ పాలకులు చెబుతున్న ఈ ఆర్థిక వృద్ధి పౌరుల స్థాయికి చేరడంలేదని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక కుండ బద్దలు కొట్టింది. ఈ నెల ఒకటో తేదీన విడుదల చేసిన కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్స్`2026 నివేదిక ప్రకారం.. భారతదేశంలో పౌరుల తలసరి ఆదాయం 2760 డాలర్లు మాత్రమే. అంటే దేశం ఇంకా దిగువ మధ్య ఆదాయ దేశాల జాబిత

DV RAMANA
Jul 83 min read


వ్యవస్థల నిశ్శబ్ధం.. ప్రజాస్వామ్య సంక్షోభం
శాశ్వత అధికారం కోసం బిజెపి వేసిన బృహత్ ప్రణాళికలో సమాజంలో అన్ని వ్యవస్థలకూ నష్టం వాటిల్లుతోంది. అందులో ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నా మాట్లాడలేని భయం. అది వారికి మరణశాసనమని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత. ‘ఏ దేశంలో అయితే, బడుల పైకప్పులు పెచ్చులూడుతూ, గుడులు బంగారం వలె మెరుస్తూ ఉంటాయో, ఆ దేశం తనకు తానే స్వయంగా వినాశనానికి దారులు వేసుకుంటుంది’.. గ్రీక్ వేదాంతి సోక్రటీస్ మాట ఇది. ఇప్ప్పుడిది మన దేశానికి అచ్చుగుద్దినట్లు సరిపోయే మాట ఇది. ఇరాన్ సముద్ర జలాలలో భారతీయ నావికుల మీద అమెరి

DV RAMANA
Jul 72 min read


మీ ఈ 20 పెట్రోల్కో దండం!
ముడిచమురు దిగుమతి బిల్లును సాధ్యమైనంతగా తగ్గించుకుని విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తన ప్రయత్నాల్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌తో బ్లెండ్ చేసి విక్రయించడం ద్వారా పెట్రోల్ వినియోగాన్ని సర్దుబాటు చేసుకోవడానికి చర్యలు చేపడుతున్నది. ఈ ప్రయత్నంలో వాహన వినియోగదారుల ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో పాటు దేశప్రజల వాహనాలను ఫణంగా పెట్టి ఇథనాల్ పెట్రోల్ ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు.. సాక్షాత్

DV RAMANA
Jul 63 min read


కొత్త స్కీమ్తోనైనా పసిడికి పగ్గాలు సాధ్యమా?
మన దేశ ఆర్థిక విధానాలను నిత్యం ప్రభావితం చేస్తున్న అంశాల్లో బంగారానికి కీలక స్థానం. పెట్రో దిగుమతులకు సరిసమానంగా బంగారంపై విదేశీ మారకద్రవ్యాన్ని భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి వస్తున్నది. యుద్ధాలు, ఇతర సంక్షోభ పరిస్థితులు ఈ భారం ఊహించనంతగా పెరిగిపోతున్నది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. భారతీయులు పసిడి ప్రియులు. బంగారు ఆభరణాలు ధరించడమే కాకుండా.. వివాహాది శుభకార్యాల్లో పిసరంత బంగారమైన తప్పనిసరిగా కొనాల్సిందేనన్న సంప్రదాయానికి వారంతా బద్ధులు. భారతీయుల సెంటిమెంట్లతోనూ

DV RAMANA
Jul 43 min read
bottom of page


